కీ.శే. శ్రీ రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారు

జననం, స్థలం: 27-12-1933, కుప్పిలి- శ్రీకాకుళం జిల్లా.
నిర్యాణం: 12.11.2014, విశాఖపట్నం.
తల్లిదండ్రులు: సూర్యకాంతమ్మ, డా. వేంకటరావు
విద్యాభ్యాసం: ప్రాథమిక విద్య స్వగ్రామం కుప్పిలి, మాధ్యమిక విద్య విజయనగరం మహారాజా కళాశాల హైస్కూల్. తదుపరి ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల, శ్రీకాకుళం.
ఉద్యోగం: (నాటి కాల్టెక్స్, నేటి హెచ్ పి.సి. ఎల్ ) ఆయిల్ రిఫైనరీ, విశాఖపట్నం, విరమణ 31.12.1991.
అభిమాన విషయాలు: సాహిత్యం, రాజకీయాలు, అనేకానేక అవధానాల్లో పృచ్ఛకత్వం.
ముద్రిత గ్రంధాలు: 1. కుఠారధార కవితా సంపుటి-1973, 2. ముళ్ళకంపలు, గులకరాళ్ళ జంటఖండికల పద్యకవిత-2004, 3. గేయగాంగేయం-2014.
అముద్రితాలు: 1. దత్తపది పూరణలు, ఎన్నోసమ్మానపత్రాలు.
రేడియో నాటికలు: అంకాలు అనుమానం, నష్టపరిహారం, సుభద్ర, టికెట్ ప్లీజ్, వగైరా...
సంగీతరూపకాలు: వరూథినీ, యుగధర్నం (ఆకాశవాణి ప్రసారాలు)
నృత్యనాటికలు: మోహినీ భస్మాసుర, క్రీస్తు శాంతి సందేశం (ప్రదర్శితాలు)
బుర్రకథ: వీర లుముంబా (కాంగో విప్లవ పోరాట కథ) ప్రదర్శితం. ఇంకా ప్రచార గీతాలు, భజన పాటలు మొదలయినవి.
బిరుదులు: దృశ్యకావ్యధురీణ, భాష్యపంచానన.

కవి యద్యవధానీ స్యాత్ సంపాద్యం “ధ” చతుష్టయం|
ధైర్యం ధారా ధోరణీచ ధారణాచ సునిశ్చలా ||