దత్తపదులు
పృచ్ఛకుని పేరు | దత్తపది | పూరణ | Audio-link | |
1. |
డా. జోశ్యభట్ల రాజశేఖర్ హైదరాబాద్, భారతదేశం. |
శ్రీ, అభేరి, బృందావని, చారుకేసి - రామ కృష్ణులకు అభేదం. |
చూడ శ్రీలనొసంగుచు సూనృతముల ఒప్పె బృందావనిన్ తా నయోధ్యగాని చారుకేశీ విలాసాల సౌరు మీర విష్ణుడే! రామకృష్ణుల! భేరి మ్రోగ! |
|
2. |
నల్లాన్ చక్రవర్తుల కిరణ్ (నచకి) హైదరాబాద్, భారతదేశం. |
శాంసంగ్, జియో, ఒప్పో, వివో (రామాయణార్థంలో). |
శ్యామ సంగమమెంచగా నమరుడయ్యె ఆజి యోర్పు వహింపగ రాజవరుడు తప్పునొప్పని జెప్పక తమ్ముడరిగె ధర్మరవివో యటంచు త త్ర్పజలు పొగడ |
|
3. |
డాక్టర్ శేషం సుప్రసన్నాచార్యులు హైదరాబాద్, భారతదేశం. |
లండను, జపాను, సీత, కుంతి (వేంకటేశ్వర కల్యాణం). |
కేలండని తలచినదో ఆలుగను జపానువృత్తయై శ్రీహరినే! లీలగు శ్రీకున్ తీరుగ గ్రోలిన దా సీత యగుచు కొండల రాయున్ (సీత= ఆకాశ గంగ) |
|
4. | నేమాని శశకళ, లండన్ | అతల, వితల, సుతల, తలాతల (ఇంద్ర సభలో దేవతల చర్చ). |
అతలము భూలోకంబున వితలము నీలోకమునకు వెరసి వచింపన్ సుతలము సద్భువనమునకు సతము తలాతలము సమము స్వర్గమ్మునగున్! |
|
5. | నేమాని రామకృష్ణ, లండన్ | పాలు, మీగడ, పెరుగు, వెన్న (రామాయణార్థంలో). |
భూమీ! గడగడ వడకకు భూమీపాలుడు శివధనువును నెక్కిడగా! ఆ మహి ప్రా పెరుగుమ ఢులి స్వామీ తావెన్న నహియు సామర్థ్యముతో! |
|
6. |
డా. వేంకట శ్రీనివాస్ పులి, ఫ్లోరిడా, అమెరికా. |
నీర, సార, బీర, రార (మద్యపాన నిషేధం). |
బీరమ్ముల విడనాడుచు మారాడక నాయకాళి మనసారంగా! రారండో మద్యము విడ నీరమ్య పథమ్ము మేలు నెల్ల ప్రజలకున్! |
|
7. | చంద్రశేఖర్ ఉపాధ్యాయుల, లండన్ | బాలు, బాపు, రమణ, వేటూరి (సినిమా ఇతివృత్తం). |
పాడ గాంధర్వముంబాలు పంచుగొనుచు వలదు జనభాష యను పేరు బాపుగొనుచు చెలగె కీర్తికి రమణుడై చిత్రములను రమ్య వేటూరి సుందరరామమూర్తి! |
|
8. |
కృష్ణ వేదుల జార్జియా, అమెరికా. |
కరి, మకరి, హరి, సిరి (రామాయణార్థంలో). |
రవిదివ్య కుల కరీంద్రుడు ధవుడయ్యెను స్థేమకరికి ధాత్రీ సుతకున్ అవతారమొంద హరియే స్తవమున తనిసిరి కనుగొని సర్వసుపర్వుల్ |
|
9. |
వేణు దశిగి ఫిలడెల్ఫియా, అమెరికా.
|
కొంగు, పొంగు, అంగ, మంగ (స్త్రీల ఔన్నత్యం). |
కొంగున్ బంగరులన ను ప్పొంగున్ గద మహిళలనగ పుడమి సతంబున్! అంగడుల వస్తువేమొకొ? మంగళముల నిచ్చువారు మానిను లెలమిన్! |
|
10. |
సత్యనారాయణ మూర్తి మధిర ప్లోరిడా, అమెరికా. |
గ్రహ, గృహ, ఆగ్రహ, అనుగ్రహ (మంచి మాటలు). |
గ్రహియింపుడు నిగ్రహ మా గ్రహమును వేపొందకుండ ననిశము ధరలో గృహమేధి యగుచు మనుజుడు సహనానుగ్రహము పొంది సార్థకుడగుతన్! |
|
11. |
రోహిత్ ఆదిపూడి జార్జియా, అమెరికా. |
బైడెన్, పుతిన్, జాన్సన్, ఇమ్రాన్ (మోడీ నాయకత్వం - ఇండియా అభివృద్ధి) |
పీడల్ బోవగ బైడెన్, కూడన్బెట్టంగ పుతిను గుణ సైనికులన్!, వీడని సంస్కృతి జాన్సను, క్రీడల నిమ్రాను చూడ కీర్తింతురయా! |
|
12. |
సురేశ్ కొలిచెల జార్జియా, అమెరికా. |
కర్ణ, వర్ణ, పర్ణ, పూర్ణ (మయసభ వర్ణన). |
వర్ణములుండియు నుండవు కర్ణములన్ నిండు గీత కళనిక్వణముల్! వర్ణింప నపర్ణాసతి పూర్ణంబుగ కొల్వుతీరు భువి మయసభలో! |
|
13. |
శ్రీనివాస్ భరద్వాజ కిశోర్ (కిభశ్రీ) జార్జియా, అమెరికా. |
తిక్కన, కేతన, పోతన, వేమన (ఆధునిక యువతి పోకడ). |
కనగ తిక్కన రాదయ కల్మషముల ( తిక్క+ అనగ) విజయ కేతనమెగురంగ విజయలగుచు పుణ్య మంది కపోత నభోవిహార లగును కానవే మన క్రొత్త యతివ ప్రగతి! |
|
14. |
శ్రీనివాసరావు అయినాపురపు, మిస్సోరీ, అమెరికా. |
వేప, చెరకు, మామిడి, మిరియము (రామాయణార్థంలో). |
కానవే పలు బాధలన్ బడె కర్మధారిగ విష్ణుడే మానినిన్ చెఱకున్ విధించగ మాయి దానవ నాథుడే ధీనతుండయి రాక్షసాళియు త్రెళ్ళ తిమ్మిరి యమ్ములన్! మానవాకృతి జేసె స్వామి! నమామి డింభక మాత్రుడన్! |
|
15. |
రమాకాంతరావు చాకలకొండ హైదరాబాద్, భారతదేశం. |
పింగ, లింగ, బింగ, సింగ (శ్రీలక్ష్మి, భూ, నీల, బీబీనాంచారి అలిమేలుమంగా సహిత వేంకటేశ్వర స్వామి వారి వర్ణన) |
పింగలాస్తోక వస్త్రుడై వేంకటేశు డనయమాలింగ నమొనర్చె నమ్మవార్ల పెక్కు వాసింగనెన్ స్వామి వీరి వలన బింగముల్ రత్నములు దాల్చి వెలుగు నతడు! |
|
16. |
హరనాథ్ గానుగపాటి న్యూజెర్సీ, అమెరికా. |
చిగురుబోడి (అమెరికా అతివల వర్ణన). |
చేయు వంటల నేర్పుమై చిగురుబోడి నిర్వహించును కార్యముల్ నిష్ఠతోడ అతి వదాన్యలె నమెరికా అతివలనిన దత్తపదముల గూర్చితి చిత్తమలర! |
|
17. |
శఠగోపన్ శ్రీవాత్సవ శేషం క్యాలీఫోర్నియా, అమెరికా. |
నాన్న, కన్న, బాబు, బుజ్జి (యశోదాదేవి కృష్ణుణ్ణి నిద్రలేపడం). |
కన్నారగ బాబూయని మున్నరయని తోషమందు బుజ్జి తనయుచే! అన్నువుతో శ్రీకృష్ణుని చెన్నుగ నాన్నా యటంచు చెయ్వుల లేపున్! |
|
18. |
శ్రీ రామచంద్ర రావు తల్లాప్రగడ క్యాలీఫోర్నియా, అమెరికా. |
రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్న (కృష్ణ రాయబారం). |
పగకు విరామంబిడవలె నొగి శుభ లక్ష్మణములందు నొప్పెడు పొత్తున్ తగ విది భరత కులేశా! సగమిచ్చుట మేలు రమణు శత్రుఘ్న సుధీ! |
|
19. |
పుల్లెల శ్యామసుందర్ క్యాలీఫోర్నియా, అమెరికా. |
చర్చి, యేసు, మేరి, సిలువ (సరస్వతీప్రార్థన). |
శాస్త్రములయందు చర్చింప శారదాంబ! తెలియు గుణమేరికన్ చూడ దివ్య కృతుల! ఆమెయే సుపూజిత కన్న నన్నిదిశల పలుకు రాదని గాసిలు వగలు వలదు. |
|
20. |
కృష్ణకుమార్ పిల్లలమఱ్ఱి క్యాలీఫోర్నియా, అమెరికా. |
సామీప్య, సాన్నిధ్య, సారూప్య, సాలోక్య (మోక్ష సాధన). |
అంద సారూప్యమున్ జపమరయు చుంద్రు నిలువ సామీప్యమున గుడుల్ నిలుపు చుంద్రు కీర్తనమ్ముల సాన్నిధ్య వర్తులగుచు కడకు సాలోక్యులై భక్తి గాంత్రు ముక్తి! |
|
21. |
కిరణ్ సింహాద్రి క్యాలీఫోర్నియా, అమెరికా. |
జాతి, మత, కుల, ప్రాంత (ప్రస్తుత సమాజశాంతి). |
మతము ముఖ్యము గా దభిమతమె గాని సంకులంబైన భావాల పంకిలముల జాతి జాతి యటన్న విజాతి యేల? ప్రాంతభేదముల్ విడనాడ శాంతి గలుగు! |
|
22. |
శ్రీధర్ బిల్ల క్యాలీఫోర్నియా, అమెరికా. |
ఎద్దు, నాగలి, రైతు, పైరు (గయోపాఖ్యానం). |
ఎ ద్దుర్మతి నిష్ఠీవన మిద్దోసిలి వేసెనా గ లిం దగ గయునిన్ పెద్దగ నెదురై తునకల నెద్దరి యుద్ధమును పై రుచింపగ జేతున్! |
|
23. |
సుబు భాగవతి జార్జియా, అమెరికా. |
కాల, కాల, కాల, కాల (సదాశివుడి వర్ణన). |
కాలజేయుచు పాపముల్ గ్రాలునతడు కాలకంఠుడునై స్పూర్తి లీలజూపు చూడ కాలస్వరూపుడై వేడుకొప్ప అట్టి కాలాహిమ త్స్థాణునంజలింతు! |
|
24. | ఆదిత్య ధవళ, లండన్ | భువి, రవి, కవి, దివి (కరోనాలో జనుల కష్టాలు). |
భువి మడియు కృచ్ఛ్రదశగా రవిజూచెడి యాశలేని ప్రజల వ్యథార్తుల్! కవికలముల నుదయించెను దివికేగ “కరోన”వ్యాధిదీనస్థితులే! |
|
25. | డా. చింతలపాటి మోహన మురళీ కృష్ణ, ఆస్ట్రేలియా. | మహర్షి, పోకిరి, మహేశ్, అతడు (రామాయణార్థంలో). |
అతడిచ్చె మంత్రమొక్కటి వితతముగ మహర్షియైన విశ్వామిత్రుం డతుల మహేశానుడనన్ క్షితిగొనె పో! కిరియ పిదప శ్రీ రాముండై! |
మీ స్పందన తెలియజేయండి
Reach us via Email or follow us on social icons below. Thank you.