అంతర్జాతీయ అంతర్జాల ఏకదిన శతావధానం

వ్యాలీ వేదిక, USA నిర్వహణలో...

ముందు మాట

శారదా కాశీవజ్ఝల

అధ్యక్షురాలు, వ్యాలీవేదిక, క్యాలీఫోర్నియా, అమెరికా.


అందరికీ నమస్కారం. ‘వ్యాలీవేదిక’ను స్థాపించి ఒక సంవత్సరం  పూర్తయ్యింది. ఈ ఏడాదిలో మిగిలిన వినోద, విజ్ఞాన, వికాస కార్యక్రమాలతోపాటుగా రకరకాల అవధానాలను ప్రయోగాత్మకంగా నిర్వహించాం. ముందుగా ‘నవాంశ చతుర్గళ అవధానం’ చేశాం.  తరువాత అందరూ అవధానులే ఉండే విధంగా ‘అష్టావధాని అష్టావధానం’ ఒకటి చేశాం. తరువాత అవధానులే పృచ్ఛకులుగా శ్రీమతి బాలభానుగారితో ‘మహిళా అవధానం’ ఒకటి నిర్వహించాం. శ్రీ బండికాడి అంజయ్య గౌడ్‌ గారితో ‘అష్టావధానం’ చేశాం. తరువాత ‘చతురంశ ఏకపద్య గర్భిత నవావధానం’ ఒకటి చేశాం. తరువాత ‘నవాంశ చతుర్గళ నవావధానం రీకిండిల్‌’ అని మరొకటి నిర్వహించాం. ఇటీవల నిర్వహించినది ‘అంతర్జాతీయ అంతర్జాల ఏకదిన శతావధానం’. అందులో ధారణాంశాలైన సమస్య, దత్తపది, వర్ణన మూడింటిని ఒకే పృచ్ఛకుడు ఎన్నుకుని, ఒక్కొక్కరూ మూడేసి అంశాలు చొప్పున మొత్తం 25 మంది పృచ్ఛకులు 75 ధారణాంశాలను అడిగారు. మరో 25 చిత్రాశువులను నిర్వహించాం. అంటే చూపించిన చిత్రానికి ఆశువుగా పద్యం చెప్పడం. ఇది ధారణేతర అంశం. ఇందులో వేరు వేరు పృచ్ఛకులు ప్రశ్నలుగా వివిధ ఇతివృత్తాలున్న చిత్రాలను అందించారు. ఈ విధంగా శతాంశాలతో... వాటిలో 75 అంశాల ధారణతో ‘సంపూర్ణ శతావధానం’ ఒక్క రోజులోనే పూర్తయ్యింది. ఇదంతా ValleyVedika యూట్యూబ్‌ ఛానల్‌లో ప్రత్యక్ష ప్రసారమైంది. అందరికీ నమస్కారం. ‘వ్యాలీవేదిక’ను స్థాపించి ఒక సంవత్సరం  పూర్తయ్యింది. ఈ ఏడాదిలో మిగిలిన వినోద, విజ్ఞాన, వికాస కార్యక్రమాలతోపాటుగా రకరకా అవధానాను ప్రయోగాత్మకంగా నిర్వహించాం. ముందుగా ‘నవాంశ చతుర్గళ అవధానం’ చేశాం.  తరువాత అందరూ అవధానులే ఉండే విధంగా ‘అష్టావధాని అష్టావధానం’ ఒకటి చేశాం. తరువాత అవధానులే పృచ్ఛకులుగా శ్రీమతి బాలభానుగారితో ‘మహిళా అవధానం’ ఒకటి నిర్వహించాం. శ్రీ బండికాడి అంజయ్య గౌడ్‌ గారితో ‘అష్టావధానం’ చేశాం. తరువాత ‘చతురంశ ఏకపద్య గర్భిత నవావధానం’ ఒకటి చేశాం. తరువాత ‘నవాంశ చతుర్గళ నవావధానం రీకిండిల్‌’ అని మరొకటి నిర్వహించాం. ఇటీవల నిర్వహించినది ‘అంతర్జాతీయ అంతర్జాల ఏకదిన శతావధానం’. అందులో ధారణాంశాలైన సమస్య, దత్తపది, వర్ణన మూడింటిని ఒకే పృచ్ఛకుడు ఎన్నుకుని, ఒక్కొక్కరూ మూడేసి అంశాలు చొప్పున మొత్తం 25 మంది పృచ్ఛకులు 75 ధారణాంశాలను అడిగారు. మరో 25 చిత్రాశువులను నిర్వహించాం. అంటే చూపించిన చిత్రానికి ఆశువుగా పద్యం చెప్పడం. ఇది ధారణేతర అంశం. ఇందులో వేరు వేరు పృచ్ఛకులు ప్రశ్నలుగా వివిధ ఇతివృత్తాలున్న చిత్రాలను అందించారు. ఈ విధంగా శతాంశాలతో... వాటిలో 75 అంశాల ధారణతో ‘సంపూర్ణ శతావధానం’ ఒక్క రోజులోనే పూర్తయ్యింది. ఇదంతా ValleyVedika యూట్యూబ్‌ ఛానల్‌లో ప్రత్యక్ష ప్రసారమైంది. 

‘అవధానసుధాకర’ ‘అవధానభీమ’, ‘అవధానభారతి’ ఇత్యాది బిరుదాంకితులు శతావధాని డా. రాంభట్ల పార్వతీశ్వరశర్మ గారు ఈ శతావధానాన్ని చేయడం ముదావహం. ఎన్ని ఒత్తిళ్ళు ఎదురైనా ఔచిత్యంతో సభను రంజింపజేస్తూ పూరణలు చేయగలరని ఇది వరకు వారు వ్యాలీవేదికలో చేసిన అవధానాల్లో తేటతెల్లమైన విషయమే. అదే పంథాలో ఏకదినశతావధానంలో గుర్తుండిపోయేలా ప్రతి అంశాన్ని ఎంతో సుందరంగా అందించారు. పృచ్ఛకులందరినీ అంతర్జాతీయ స్థాయిలో రకరకాల కాలమానాల నుండి  తీసుకోవడం వల్ల సమన్వయ పరచడం ఎంతో క్లిష్టమైన విషయం. అదృష్టవశాత్తు సంచాలకులు ‘అవధాని వేదండ’ నేమాని లక్ష్మీ నరసింహ సోమయాజులు గారు ఏది ఎలా చేయాలో ఎంతో ఓపికతో చెప్పి సహకరించారు.

పసిఫిక్‌ కాలమానం ప్రకారం ఏప్రిల్‌ 10వ తేదీ ఉదయం 9 గం॥కు మొదలు పెట్టుకున్నాం. మేమనుకున్న దానికంటే నాలిగింతలు  వేగం తగ్గి నడుస్తోందని అర్థమైంది. మొదటి 25 అంశాలకు గంటన్నర పడుతుందని అంచనా వేసుకున్నాం. కాని సమస్యాపూరణ మధ్యలోనే, దాదాపు గంటన్నర గడువుదాటింది. దానికి కారణం ఏకదిన శతావధానంలో పృచ్ఛకులు ఎంతో క్లిష్టమైన సమస్యలు తీసుకురావడం ఒకటైతే, వారిలో చాలామందికి వివిధ కాలమానాలలో నిద్రాసమయం కావడమో, గృహసంబంధమైన ఇతరత్రా పనులుండడమో రెండవది కావచ్చును. అందువల్ల పృచ్ఛకుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని దాదాపు 6-7 గంటల అవిశ్రాంత అవధాన నిర్వహణ తర్వాత నాలో కొంత ఆందోళన కలిగింది. ‘‘సాధారణంగా మూడురోజులలో చేసే కార్యక్రమం కాబట్టి  ఏకదినంలో జరిగే అవకాశం లేదోమో, ఎంతో పెద్ద విషయాన్ని ఊహించకుండా తకెత్తుకున్నామేమో’’ అని అనిపించింది. అవధానం ఆపకుండా మరుసటి రోజుకు వాయిదా వేసుకుని కొనసాగిద్దామని అనుకున్నాం. పృచ్ఛకులకు దాదాపు 3-4 గంటల సమయం నిద్రపోవడానికి తదితర కార్యక్రమాలు చేసుకోవడానికి విరామం ప్రకటించాం. 

అయితే అంతలోనే పృచ్ఛకుందరూ కొంత విశ్రాంతి తీసుకుని తిరిగి సిద్ధమవడంతో ఒకేరోజులో శతావధాన్ని పూర్తిచేయాని మళ్ళీ  కొనసాగించాం. అనుకున్నది ఏకదినమే. అవిరామంగా కాదుకదా. అదృష్టవశాత్తు ఈ విరామం తర్వాత ఎంతో ఉత్సాహంతో అందరి సహకారంతో మిగతా కార్యక్రమాన్ని పూర్తిచేసుకోగలిగాం.

అవధాని రాంభట్లవారి హాస్యచతురత అందరికీ తెలిసినదే. ఎక్కడెక్కడ ఎలా మాటలగారడి చెయ్యాలో అలా చేస్తూ పొందికగా పూర్తిచేసారు. పృచ్ఛకులతోపాటు కార్యక్రమాన్ని ప్రత్యక్షప్రసారంగా చూసి ఆస్వాదించిన ఎందరో సాహిత్య అభిమానులు, పండితులు రాంభట్లవారి పూరణ విధానాన్ని ఎంతగానో ప్రశంసించారు. అవధానులందరూ అమితమైన పాండితీ వైభవంతోనే ఉంటారు. కానీ రాంభట్లవారు సాధారణ స్థాయికి మించి భాషలోను, పూరణపద్ధతిలోనూ ప్రతిభను ప్రదర్శించారని సభ్యులందరూ మెచ్చుకున్నారు. ఇంతటి ఒత్తిడిలోకూడా ఏదోలా పూరణ చేయడం కాకుండా ఉన్నతంగా, అర్థవంతంగా సరైన రీతిలో న్యాయం చేస్తూ పూరించడం అభినందనీయం. దానికి తోడు కఠినవిషయాన్నికూడా అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పడమనేది నాకు ఆయనలో ప్రత్యేకంగా నచ్చిన విషయం. ఆయన్ని ఆరోజు రాత్రంతా ప్రశ్నలమీద ప్రశ్నలతో.. అప్రస్తుత ప్రసంగాలతో ఎంతో శ్రమపెట్టాం. అయినప్పటికీ ఎప్పటిలాగానే అన్నింటినీ తట్టుకుని అమెరికా కాలమానం ప్రకారం అంతర్జాలంలో ‘వ్యాలీవేదిక’ మీద ‘ఏకదినం’లోనే (14 గంటలలోనే) పూరణ, ధారణతో సంపూర్ణ శతావధానాన్ని పూర్తి చేసారు. అందుకే విజయోత్సవ సభలో వారిని ‘శతావధాన కంఠీరవ’ అనే బిరుదుతో ‘వ్యాలీవేదిక’ సత్కరించింది.  నభూత:కార్యక్రమాలను చేయాలనే నా ఆలోచనను తీసిపారేయకుండా ఎంతో గౌరవించి, ఈ బృహత్‌ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తిచేసినందుకు అవధానిగారికి, సంచాలకులకు, పాల్గొన్న పృచ్ఛకులందరికీ, వేదిక మీద, వెనక తోడ్పడిన ప్రతి కార్యకర్తకీ, శ్రేయోభిలాషులకు మనస్పూర్తిగా ధన్యవాదాలు.

International On-line One-Day Satavadhanam

An alumnus and researcher who has completed his MA and PhD in the Telugu Department of Andhra University, "Shatavadhani" Dr. Rambhatla Parvatishwara Sarma has received unprecedented recognition at the international level. During the "Plavanama" Ugadi celebrations, "ValleyVedika" - California, USA has arranged a special online program where he has effectively performed the most complex and tipical literary game "International On-line Ekadina Sathavadhanam" and won the hearts of Telugus all over the world and created a new record. This was organised via Zoom video conference from 8 a.m. Saturday (PST) (9pm Indian time on Saturday) for about 14 hours. "Avadhana Vedanda" Lakshmi Narasimha Somayajulu Nemani (Atlanta, USA) was Coordinated the program. Experts, scholars from the United States, London, Australia, and other European countries enthusiastically participated and tested Dr Sarma's attention in poems with rare meters, pictorial, and strange questions.

Questioners have asked 25 Samsya, 25 Dattapadi, 25 Varnana, 25 Chitra Aasuvu, as well as Avadhani Parvatishwara Sharma greedily filled in a total of 100 items in all these four sections. Later traditionally 75 of them were retrieved in "dharana" at the end of avadhanam in about 40 minites. Thousands of the literary lovers were watched the show live on social media like Facebook and Youtube.

Generally people performs "Sathavadhanam" for 3 days by taking questions and givng poems in 8 hours each day ... Sharda Kashivajla, president of Valley Vedika, USA said that this was the first time in history to conduct "an Online International one-day Sathavadhanam" in a span of 14 hours. Parvateeswara Sarma was honored with the title of "Shatavadhana Kanthirava" in the Vijayotsava Sabha.


అంతర్జాతీయ అంతర్జాల ఏకదిన శతావధానం - సంగ్రహ పరిచయం

ఆంధ్రవిశ్వవిద్యాలయం తెలుగుశాఖలో ఎం.ఏ., పీహెడీలను పూర్తిచేసిన పూర్వవిద్యార్థి, పరిశోధకుడు "శతావధాని" డా. రాంభట్ల పార్వతీశ్వర శర్మకు అంతర్జాతీయ స్థాయిలో అపూర్వమైన గుర్తింపు లభించింది. "ప్లవనామ" ఉగాది సందర్భంగా "వ్యాలీవేదిక" - కాలీఫోర్నియా, అమెరికా వారి నిర్వహణలో "అంతర్జాతీయ అంతర్జాల ఏకదిన శతావధానం" అనే అత్యంత క్లిష్టమైన సాహిత్యక్రీడను సమర్థంగా ప్రదర్శించి, కొత్త రికార్డుతో విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగువారి జేజేలందుకున్నారు. Zoom వీడియో సమావేశం ద్వారా అమెరికా కాలమానం ప్రకారం (PST) శనివారం ఉదయం 8 గంటలనుండి - (భారతకాలమానం ప్రకారం శనివారం రాత్రి 9 గంటలనుండి) దాదాపు 14 గంటలపాటు ఈ శతావధానం జరిగింది. ఇందులో సంచాలకులుగా "అవధాన వేదండ" నేమాని లక్ష్మీ నరసింహ సోమయాజులు (అట్లాంటా, USA) వ్యవహరించారు. నిష్ణాతులైన పండితులు పృచ్ఛకులుగా అమెరికా సంయుక్తరాష్ట్రాలు, లండన్, ఆస్ట్రేలియా ఇంకా ఇతర యూరోపియన్ దేశాలనుండి పాల్గొని క్రిష్టప్రాసలతో, అరుదైన ఛందస్సులతో, చిత్ర, విచిత్రమైన ప్రశ్నలతో అవధానిని పరీక్షించారు. 25 సమస్యలు 25 దత్తపదులు, 25 వర్ణనలు, 25 చిత్రాశువులు ఇలా నాలుగు విభాగాలలో మొత్తం 100 అంశాలను అవధాని పార్వతీశ్వర శర్మ అత్యాశువుగా పూరించారు. సంప్రదాయబద్ధంగా వాటిలో 75 ధారణాంశాలను చివరలో దాదాపు 40 నిముషాలలో తిరిగి యధాతథంగా ధారణ చేసి సభకు అప్పజెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచారు.

సాధారణంగా శతావధానమంటే రోజుకు 8 గంటలచొప్పున... 3 రోజులపాటు జరగడం పరిపాటి. అంతర్జాలంలో ఈ తరహాలో శతావధానాలు జరిగినప్పటికీ "ఏకదిన శతావధానం" అది కూడా అవిరామంగా 14 గంటలలో పూరణ, ధారణలతో ఆశువుగా నిర్వహించడం చరిత్రలో ఇదే ప్రప్రథమం అని సంస్థ అధ్యక్షురాలు శారదా కాశీవజ్ఝల పేర్కొన్నారు. విజయోత్సవ సభలో "శతావధాన కంఠీరవ" బిరుదుతో పార్వతీశ్వర శర్మను ఘనంగా సత్కరించారు.

పదో యేట నుండే పద్యంరాయడంలో పరిశ్రమచేస్తూ పదహారేళ్ల వయస్సులో అష్టావధానాన్ని చేసిన యువావధాని, శతావధాని డా. రాంభట్ల పార్వతీశ్వర శర్మ. “అవధాన సుధాకర”, “అవధాన భారతి”, “అవధాన భీమ”, "అవధానకిశోర", "అసమాన ధారణాధురీణ" "నవయువావధాని" "క్షేమేంద్ర సారస్వత సరస్వతి" “అవధానకేసరి” "అవధానిశేఖర" “శతావధాని” అనే బిరుదులతో అంతర్జాతీయంగా ప్రాచుర్యాన్ని పొందారు. ఆశుకవితావిన్యాసంలో నిష్ణాతులు. అవధానవిద్యలో యువతకు ఆదర్శనీయులు.

"అక్షరలక్ష" గాయత్రీ మహామంత్రోపాసకులు లక్ష్మీ నరసింహ సోమయాజులు, సూర్యకాంతకామేశ్వరి దంపతులకు 1988లో శ్రీకాకుళంలో జన్మించారు. వీరి తాతగారు పార్వతీశ్వర శర్మగారి నుండి అవధాన విద్యను అభ్యసించారు. వీరి కుటుంబమంతా కవులు, పండితులు, సాహితీవేత్తలే. తమ 16వ ఏటనే తెలుగు సాహిత్యంలో విశిష్టమైన “అష్టావధానాన్ని” చేసి అందరి మెప్పులు పొంది అందర్నీ ఆశ్చర్యపరిచిన దిట్ట. తెలుగు రాష్ట్రాలలో ఇప్పటివరకు 74 అష్టావధానాలు చేసి, మాడుగుల, గరికిపాటి, మేడసాని, నరాల, కడిమిళ్ళ, కోట, పాలపర్తి, వద్దిపర్తి, జి.ఎమ్. రామశర్మ వంటి అవధానదిగ్గజాల ప్రశంసలందుకున్న ప్రతిభామూర్తి. Degree వరకు చదువుకున్నది సైన్స్‌ అయినా... తెలుగులోనూ, సంస్కృతంలో ఎం.ఏ.లను పూర్తిచేసారు. ప్రతిష్ఠాత్మకమైన ఆంధ్రవిశ్వవిద్యాలయంలో “U.G.C.” వారి “ఫెలోషిప్" తో ఆచార్యులు "అద్వైతసిద్ధిరత్నాకర" మద్దులపల్లి దత్తాత్రేయశాస్త్రి గారి పర్యవేక్షణలో క్షేమేంద్రుడి "ఔచిత్య విచార చర్చ" మీద ప్రీతితో “తెలుగు ప్రాచీన పంచకావ్యాలు - ఔచిత్యం” అన్న పరిశోధనతో పీహెచ్‌.డీ.ను పూర్తి చేసి డాక్టరేట్‌ పట్టాను పొందారు.

2015, నవంబరులో... విశాఖ “కళాభారతి"లో మూడు రోజులపాటు “శతావధానం” చేసి సంచలనాత్మక రికార్డును సృష్టించి, ప్రపంచవ్యాప్తంగా యువ కవి పండితుల్ని ఆశ్చర్య చకితుల్ని చేసారు. లెక్కకు మించిన ప్రసంగాలు... దూరదర్శన్‌ లోనూ, ఆకాశవాణిలోనూ ఆశుకవితా ప్రదర్శనలు నిర్వహించారు.


మీ స్పందన తెలియజేయండి

Reach us via Email or follow us on social icons below. Thank you.