అంతర్జాతీయ అంతర్జాల ఏకదిన శతావధానం

వ్యాలీ వేదిక, USA నిర్వహణలో...

సంచాలక వాణి

అవధాని వేదండ నేమాని లక్ష్మీ నరసింహ సోమయాజులు

శతావధాన సంచాలకులు, అట్లాంటా, జార్జియా, అమెరికా.


వాగధిదైవతంబయిన భారతి చల్లనిచూపులొప్పగా
సాగెను భావపూర్ణముగ చక్కగ పూరణలన్ని కాంచగా
వేగ శతావధాన పరివృత్తమొనర్చెను బార్వతీశుడున్
బాగుగ సౌఖ్యసంపదలు వర్ధిల దీవెన లేను బల్కెదన్ ||

చక్కని ధారతోడను బ్రశస్తముగా విలసిల్లు పూరణల్
గ్రుక్కను దిప్పకుండగను గూరిమితో నొనరిచె ధారణం
బొక్కదినంబునందుననె యొప్పుగఁ జేయ శతావధానమున్
మక్కువతోడఁ బల్కెదను మంగళవాక్యము లీవధానికిన్ ||

అవధానిపార్వతీశుడు
భువినందలి సుకవిజనులు పూర్తిగ మెచ్చన్
కవనమ్మును సలిపెంగద
స్తవనీయంబుగ వధానసమయమునందున్ ||

గుర్వుగా విలసిల్లు ధారయు గొప్పభావము లొప్పగా
నుర్విలో నరుదైనరీతిగ నొక్కపూట వధానమున్
పార్వతీశ్వరశర్మ చేసె, శుభమ్ములొందగ కోరెదన్
సర్వదేశజనాళికూడను సత్కృతుల్ వినిపించిరే||


మీ స్పందన తెలియజేయండి

Reach us via Email or follow us on social icons below. Thank you.